తరుణ్ తల్లి మాటలు విని దిగ్భ్రాంతికి గురయ్యాను: ప్రియమణి
- తరుణ్ తో నవ వసంతం చిత్రంలో నటించిన ప్రియమణి
- తరుణ్ తో లంచ్ లు, డిన్నర్లకు వెళ్లానని వెల్లడి
- తరుణ్ తల్లి ప్రేమ అనుకున్నారని వివరణ
"ఓ రోజు సెట్స్ పైకి రోజారమణి కూడా వచ్చారు. ఆమె నా వద్దకు వచ్చి... మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది. ఇష్టమైతే తరుణ్ ను పెళ్లిచేసుకోవచ్చు అని చెప్పారు. దాంతో నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. వెంటనే తేరుకుని, తరుణ్ తో ఉన్నది కేవలం స్నేహమేనని, మీరు పొరబడ్డారని చెప్పాను" అంటూ నాటి సంగతులు పంచుకుంది. కాగా, ప్రియమణి మూడేళ్ల కిందట వ్యాపారవేత్త ముస్తఫా రాజ్ ను పెళ్లాడి లైఫ్ లో సెటిలైంది.