Corona Virus: దేశంలో కొత్తగా 45,209 మందికి కరోనా నిర్ధారణ

45209 new cases in a day
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో మళ్లీ 45 వేల కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 45,209 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,95,807 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 43,493 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 501 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,33,227 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 85,21,617 మంది కోలుకున్నారు. 4,40,962 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 13,17,33,134  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,75,326 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News