బల్దియా బరిలో 68 నామినేషన్ల తిరస్కరణ!
- పూర్తయిన నామినేషన్ల పరిశీలన
- 1,825 నామినేషన్లు సక్రమమే
- ముగ్గురు పిల్లలున్నందున కూన శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ తిరస్కరణ
ఇక మాదాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ పత్రాలు సరిగ్గా లేవని, పైగా ఆయనకు ముగ్గురు పిల్లలున్నారన్న కారణాలు చెబుతూ, ఆయన నామినేషన్ ను కూడా తిరస్కరించారు. ఈ ఘటనల తరువాత రిటర్నింగ్ అధికారుల కార్యాలయం వద్దకు పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు రాగా, పోలీసులు వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. శ్రీనివాస్ గౌడ్, ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిబంధనల మేరకే ఆయన నామినేషన్ రద్దయిందని అధికారులు స్పష్టం చేశారు.
కాగా, నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుండగా, పలు పార్టీల తరఫున రెబల్స్ గా బరిలో ఉన్నవారిని బుజ్జగించేందుకు పెద్ద నేతలు రంగంలోకి దిగారు. దీంతో నేడు చాలా మంది తమ అభ్యర్థిత్వాలను వదులుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపసంహరణ పూర్తయిన తరువాతనే, ఎన్నికల బరిలో ఎంతమంది మిగులుతారన్న విషయం తేలుతుంది.