Corona Virus: దేశంలో 24 గంటల్లో 46,232 మందికి కరోనా నిర్ధారణ

46232 new COVID19 infections
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రోజుల క్రితం కాస్త తగ్గినట్లు కనపడిన కేసులు మళ్లీ పెద్ద మొత్తంలో నమోదవుతున్నాయి.  దేశంలో మళ్లీ 40 వేలకు మించి కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 46,232 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,50,598 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 49,715 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 564  మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,32,726 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 84,78,124 మంది కోలుకున్నారు. 4,39,747 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 13,06,57,808 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,66,022 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News