కరోనాతో కన్నుమూసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ

  • గత నెల పదో తేదీ నుంచి బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స
  • ఈ నెల 3న మరింత దిగజారిన ఆరోగ్యం
  • వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం శూన్యం
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీఏ సత్యప్రభ కరోనాతో కన్నుమూశారు. ఆమె వయసు 70 సంవత్సరాలు. కరోనా వైరస్ బారినపడిన సత్యప్రభ గత నెల 10వ తేదీ నుంచి బెంగళూరులోని తమ కుటుంబానికి చెందిన వైదేహీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ నెల 3న ఆమె పరిస్థితి మరింత క్షీణించడంతో వెంటిలేటర్‌పైకి చేర్చారు. గత రాత్రి పరిస్థితి మరింత దిగజారడంతో తుదిశ్వాస విడిచారు.

చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన సత్యప్రభ మెట్రిక్యులేషన్ చదువుకున్నారు. ఆమె భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన డీకే ఆదికేశవులు నాయుడు కాంగ్రెస్‌లో మంచి పేరున్న నాయకుడిగా ఎదిగారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆయన 2004లో చిత్తూరు నుంచి ఎంపీగా గెలిచారు. రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. 2013లో అనారోగ్యంతో ఆయన మృతి చెందిన తర్వాత సత్యప్రభ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో టీడీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Go Back to Shorts
DK Satyaprabha
DK Adikeshavulu Naidu
Chittoor District
TDP
Andhra Pradesh

More Telugu News