Corona Virus: దేశంలో 45,576 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ

spike of  45576 new cases in india
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 89,58,484
  • కోలుకున్న వారు 48,493 మంది
  • మొత్తం మృతుల సంఖ్య 1,31,578
దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 45,576 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 89,58,484కి చేరింది. ఇక గత 24 గంటల్లో 48,493 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 585 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,31,578 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 83,83,603 మంది కోలుకున్నారు. 4,43,303 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.              
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 12,85,08,389 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,28,203 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News

Corona Virus
COVID19
India