‘గ్రేటర్’ వార్: నామినేషన్ల దాఖలు షురూ.. తొలి రోజు 20 నామినేషన్ల దాఖలు
- అత్యధికంగా టీఆర్ఎస్ నుంచి ఆరుగురు
- టీడీపీ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ఇద్దరు నామినేషన్లు
- నామినేషన్ల దాఖలకు ఈ నెల 20 చివరి గడువు
150 వార్డులకు డిసెంబరు 1న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు ఈ నెల 20 ఆఖరు కాగా, 21న నామినేషన్లను పరిశీలిస్తారు. 22న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. బరిలో నిలిచే అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల దాఖలకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.