Dhanush: దక్షిణాదిన మరో రికార్డు కొట్టిన 'రౌడీ బేబీ' పాట!

Rowdy baby song sets another record
షార్ట్స్‌లో చూడండి
కొన్ని సినిమాలలోని పాటలు ఇటీవలి కాలంలో యూ ట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఆ పాటకు వచ్చే ఆదరణను బట్టి ఆయా పాటలు యూ ట్యూబ్ లో రికార్డు మొత్తంలో హిట్స్ తెచ్చుకుంటున్నాయి. ముఖ్యంగా దక్షిణాది సినిమాలలోని పలు పాటలు ఇటీవలి కాలంలో దుమ్మురేపుతున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి 'రౌడీ బేబీ' పాట!

తమిళ హీరో ధనుష్, హోమ్లీ హీరోయిన్ సాయిపల్లవి కలసి నటించిన చిత్రం 'మారి 2'. బాలాజీ మోహన్ దర్శకత్వంలో రెండేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులోని 'రౌడీ బేబీ' పాట సూపర్ డూపర్ హిట్టయింది. ధనుష్, సాయిపల్లవిల డ్యాన్స్ కు ప్రేక్షకులు మత్తెక్కి ఊగిపోయారు. అంతలా ఈ పాట ప్రేక్షకులకు పట్టేసింది. దీంతో యూ ట్యూబ్ లో ఇది నేటికి 100 కోట్ల (బిలియన్) వ్యూస్ ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.

 ఈ సందర్భంగా హీరో ధనుష్ ఈ రోజు ట్వీట్ చేస్తూ, 'కొలవరి డీ పాట వార్షికోత్సవం రోజునే రౌడీ బేబీ పాట బిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం ఒక మధురమైన కాకతాళీయంగా చెప్పుకోవాలి. బిలియన్ వ్యూస్ ను పొందిన తొలి దక్షిణాది పాటగా దీనికి గుర్తింపు రావడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు' అంటూ పేర్కొన్నాడు.
Go Back to Shorts
Dhanush
Sai Pallavi
Yuvan Shankar Raja
Rowdy Baby

More Telugu News