దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పాక్ ప్రధాని ఇమ్రాన్ పై నెటిజన్ల విసుర్లు
- పాకిస్థాన్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులు
- హ్యాపీ దివాలి అంటూ ట్వీట్ చేసిన ఇమ్రాన్ ఖాన్
- పాకిస్థాన్ లో హిందువులు ఎవరున్నారన్న నెటిజన్లు
హిందువులకు శుభాకాంక్షలు చెబుతున్నారు సరే, అసలింతకీ పాకిస్థాన్ లో ఎవరైనా హిందువులు మిగిలున్నారా? వాళ్లెప్పుడో మతమార్పిడికి గురయ్యుంటారని అనుకుంటున్నాను అని సోనియా సింగ్ అనే నెటిజన్ పేర్కొన్నారు. పాక్ ప్రధాని చేసిన ట్వీట్ లో ఎన్ని అక్షరాలు ఉంటాయో అంతమంది హిందువులు ఉండొచ్చంటూ మరో నెటిజన్ స్పందించారు. పాకిస్థాన్ లో మీరేం మిగిల్చారు గనుక! అంటూ ఎతిరాజన్ అనే వ్యక్తి వ్యాఖ్యానించారు.