చిన్న మచ్చ కూడా లేని పింక్ డైమండ్ కు అదిరిపోయే ధర!
- అరుదైన గులాబీరంగు వజ్రాన్ని వేలం వేసిన సోత్ బీ
- స్విట్జర్లాండ్ లో వేలం
- రూ.193 కోట్లకు కొనుగోలు చేసిన అజ్ఞాతవ్యక్తి
'స్పిరిట్ ఆఫ్ ద రోజ్' అని పిలిచే ఈ వజ్రం 2017లో రష్యాలోని ఈశాన్య ప్రాంతంలో లభ్యమైంది. గనిలో లభ్యమైన సమయంలో దీని బరువు 27.85 క్యారట్లు కాగా, సానబట్టి మెరుగులు దిద్దిన అనంతరం ఆ బరువు 14.83 క్యారట్లకు తగ్గింది. రష్యాలో లభ్యమైన గులాబీ రంగు వజ్రాలన్నింటిలో ఇదే పెద్దది. సోత్ బీ తాజాగా నిర్వహించిన వేలంలో ఈ వజ్రాన్ని ఓ అజ్ఞాతవ్యక్తి కొనుగోలు చేశాడు.