Corona Virus: దేశంలో మరో 41,100 మందికి కరోనా నిర్ధారణ

41100 COVID19 infections IN India
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,14,579
  • కోలుకున్న 42,156 మంది
  • మృతుల సంఖ్య 1,29,635
  • కోలుకున్న 82,05,728 మంది  
భారత్ లో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 41,100 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,14,579 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 42,156
 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 447 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,29,635 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 82,05,728 మంది కోలుకున్నారు. 4,79,216 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.              
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 12,48,36,819 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,05,589 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News

Corona Virus
COVID19
India