బీజేపీ సీనియర్ నేత కైలాష్ సారంగ్ కన్నుమూత!
- గత కొన్ని రోజులుగా అనారోగ్యం
- ముంబైలోని ఆసుపత్రిలో తుది శ్వాస
- సంతాపం తెలిపిన ప్రధాని
కైలాష్ మరణవార్తను గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. రాష్ట్రాభివృద్ధికి ఆయనెంతో శ్రమించారని, ఆయన కుటుంబీకులకు తన సంతాపాన్ని తెలుపుతున్నానని ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.