ఓడిపోతారని తెలిసి కూడా.. హరీశ్‌రావును బలిపశువును చేశారు: జితేందర్ రెడ్డి
- దుబ్బాకలో ఓడిపోతామనే విషయం కేసీఆర్ కు తెలుసు
- కేసీఆర్ పోకడలను తిప్పికొట్టాలనే కసి ప్రజల్లో ప్రారంభమైంది
- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 80 సీట్లను గెలుస్తాం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం బీజేపీ సత్తా చాటుతుందని జితేందర్ రెడ్డి తెలిపారు. వరదల సమయంలో ముంపు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని విమర్శించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా 84 వేల మంది ప్రజలు నిలబడ్డారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 80 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని అన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో అన్ని పార్టీల నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయని తెలిపారు. అయితే, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి బీజేపీలో ఎప్పుడు చేరబోతున్నారనే సమాచారం తన వద్ద లేదని చెప్పారు.