విష్ణు వాళ్ల నాన్న డీజీపీగా పనిచేశారు: గుత్తా జ్వాల
- తమిళ నటుడు విష్ణువిశాల్ ప్రేమలో జ్వాల
- ఇద్దరికీ ఆమధ్య జరిగిన నిశ్చితార్థం
- కెరీర్ పై ఆసక్తే తామిద్దరినీ కలిపిందన్న జ్వాల
విష్ణు నటించిన కొన్ని చిత్రాలు ఇటీవల విజయవంతం అయ్యాయని, అతను నటించిన 'రాచ్చసన్' చిత్రం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఓ రకంగా ప్రస్తుత సమయం తామిద్దరికీ కెరీర్ పరంగా ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇద్దరం కృషిని నమ్ముతామని, అందుకే పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకుంటామని అన్నారు.
విష్ణు వాళ్ల తండ్రి డీజీపీగా పనిచేశారని, ఆయన ఇటీవలే రిటైరయ్యారని జ్వాల వెల్లడించారు. తండ్రి బాటలోనే విష్ణు కష్టాన్నే నమ్ముకున్నాడని తెలిపారు. ఇక, తమ పెళ్లి గురించి చెబుతూ, తామిద్దరికి నిశ్చితార్థం అయిందని, పెళ్లి ఈ ఏడాది ఉండదని స్పష్టం చేశారు. ఆ శుభ సమయం ఎప్పుడో తాను తప్పకుండా వెల్లడిస్తానని జ్వాల పేర్కొన్నారు.