Budda Venkanna: టీడీపీ లాయర్ల శక్తిపై అంత నమ్మకం ఉంటే జగన్ కేసుల్లో వాదించడానికి వాళ్లనే పెట్టుకోండి: బుద్ధా వ్యంగ్యం

Buddha opines on bail issue Nandyal suicide case
షార్ట్స్‌లో చూడండి
నంద్యాల ఆత్మహత్యల కేసులో అరెస్టయిన సీఐ, హెడ్ కానిస్టేబుల్ కు టీడీపీ న్యాయవాది వల్లే బెయిల్ వచ్చిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండడం తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు.

టీడీపీ లాయర్లకే అంతశక్తి ఉంటే అచ్చెన్నాయుడుకు బెయిల్ రావడానికి మూడు నెలలు, కొల్లు రవీంద్రకు బెయిల్ రావడానికి రెండు నెలలు ఎందుకు పడుతుందని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు బెయిల్ రాకుండా నెలల తరబడి అడ్డుకోగలిగిన ప్రభుత్వం నంద్యాల నిందితుల విషయంలో 12 గంటలు కూడా ఎందుకు ఆపలేకపోయిందని నిలదీశారు.

టీడీపీ లాయర్ల శక్తిపై అంత నమ్మకం ఉంటే జగన్ అవినీతి కేసుల్లో వాదించేందుకు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద న్యాయవాదులను కోట్లు గుమ్మరించి తెచ్చే బదులు వీరినే పెట్టుకోండి అని బుద్ధా సెటైర్ వేశారు.
Go Back to Shorts
Budda Venkanna
Bail
Police
Nandyal
Lawyer
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News