బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. విచారణకు హాజరైన నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలు
- సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి
- ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను విచారించిన అధికారులు
- నేడు విచారణకు హాజరు కానున్న అర్జున్ రాంపాల్
గత సోమవారం అర్జున్ రాంపాల్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణకు రావాలంటూ రాంపాల్తోపాటు ఆయన ప్రేయసి గాబ్రియెల్లాకు సమన్లు జారీ చేశారు. అందులో భాగంగా నిన్న మధ్యాహ్నం ఆమె ఎన్సీబీ కార్యాలయానికి చేరుకోగా, అధికారులు ఆమెను విచారించారు. నేడు అర్జున్ రాంపాల్ విచారణకు హాజరు కానున్నాడు.