సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'ఖిలాడి' సినిమాలో అనసూయ కీలక పాత్ర
- హారర్ థ్రిల్లర్ గా రానా దగ్గుబాటి 'ధీరుడు'
- అమెజాన్ ప్రైమ్ ద్వారా 'మిడిల్ క్లాస్ మెలోడీస్'
* రానా దగ్గుబాటి తాజాగా 'గృహం' ఫేమ్ మిలింద్ డే దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి ఓకే చెప్పాడు. హారర్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రానికి 'ధీరుడు' అనే టైటిల్ని ఖరారు చేశారు. కాగా, ఈ చిత్రం చేతబడుల నేపథ్యంతో కూడిన కథతో తెరకెక్కుతుంది. జనవరి నుంచి షూటింగ్ మొదలవుతుంది.
* ఆనంద్ దేవరకొండ కథానాయకుడుగా ఎ.వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మిడిల్ క్లాస్ మెలోడీస్' చిత్రం ట్రైలర్ ను నిన్న విజయ్ దేవరకొండ విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ నెల 20న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.