Pooja Hegde: హీరోయిన్‌ పూజ హెగ్డే గురించి చిన్నారి ఆసక్తికర వ్యాఖ్యలు.. సంబరపడి వీడియో పోస్ట్ చేసిన హీరోయిన్

puja posts a girls video
  • తాను పెద్దయ్యాక హీరోయిన్ అవుతానన్న పాప
  • హీరోయిన్ అయితే బాగా డ్యాన్స్ చేయొచ్చని వ్యాఖ్య
  • పూజ అందంగా ఉంటుందని చెప్పిన పాప
హీరోయిన్ పూజ హెగ్డే గురించి ఓ చిన్నారి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై చివరకు పూజ హెగ్డే కూడా స్పందించి హర్షం వ్యక్తం చేసింది. తాను పెద్దయ్యాక హీరోయిన్ అవుతానని ఓ పాప చెప్పింది. ఎందుకు అవుతావని ప్రశ్నించగా.. హీరోయిన్ అయితే బాగా డ్యాన్స్ చేయొచ్చని చెప్పింది. నీ అభిమాన హీరోయిన్‌ ఎవరు? అని ప్రశ్నించగా పూజ హెగ్డే అని చెప్పింది. పెద్దయ్యాక ఏమవుతావు? అని ఒకరు ప్రశ్నించగా తాను పెద్దయ్యాక హీరోయిన్‌ పూజా హెగ్డే అవుతానని చెప్పింది.

ఆమె అందంగా ఉంటుందని, ఆమె అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. దీనిపై పూజ హెగ్డే స్పందిస్తూ... ఓ మైగాడ్‌ అని సంబరపడిపోయింది. ఆ పాప  వీడియోతో తనరోజు పరిపూర్ణం అయిందని చెప్పింది. ఆ పాప బుగ్గలు చాలా ముద్దుగా ఉన్నాయని చెప్పింది. ఏదో ఒకరోజు కచ్చితంగా ఆమెను కలుస్తానని తెలిపింది. అప్పటివరకు తన లవ్‌ను, ముద్దులను ఈ ట్వీట్ ద్వారా పంపిస్తున్నానని చెప్పింది. కాగా, 'అల వైకుంఠపురములో' సినిమాతో భారీ‌ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న పూజ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది.
Pooja Hegde
Tollywood
Viral Videos

More Telugu News