Dubbaka: 8వ రౌండ్లో మళ్లీ బీజేపీ ఆధిక్యత.. హరీశ్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు షాకిచ్చిన ఓటర్లు

BJP gets lead in 8th round of Dubbaka
  • ఎనిమిదో రౌండులో బీజేపీకి 621 ఓట్ల ఆధిక్యత
  • హరీశ్ దత్తత తీసుకున్న గ్రామంలో వెనుకబడ్డ టీఆర్ఎస్
  • 3,106 ఓట్ల లీడింగ్ లో రఘునందన్ రావు

దుబ్బాక ఉపఎన్నిక ఫలితాల సరళి టెన్షన్ పెంచుతోంది. ఆరో రౌండ్ నుంచి సీన్ ఛేంజ్ అయింది. తొలి ఐదు రౌండ్లలో వెనుకపడిపోయిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత పుంజుకుంది. ఆరు, ఏడు, రౌండ్లలో ఆధిక్యతను సాధించి ఉత్కంఠను పెంచింది. అయితే ఎనిమిదో రౌండులో బీజేపీ మళ్లీ పైచేయి సాధించింది.

ఎనిమిదో రౌండులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 621 ఓట్ల మెజార్టీని సాధించారు. ఎనిమిదో రౌండ్ ముగిశాక బీజేపీ ఆధిక్యత 3,106కి చేరింది. మరోవైపు మంత్రి హరీశ్ రావు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు చేదు అనుభవం మిగిలింది. ఉత్తమ్ దత్తత తీసుకున్న లచ్చపేట గ్రామంలో కాంగ్రెస్ కు కేవలం 163 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ గ్రామంలో బీజేపీకి 490, టీఆర్ఎస్ కు 520 ఓట్లు వచ్చాయి. మరోవైపు హరీశ్ రావు దత్తత తీసుకున్న చీకోడు గ్రామంలో టీఆర్ఎస్ కంటే బీజేపీ 22 ఓట్ల ఆధిక్యతను సాధించింది.

  • Loading...

More Telugu News