మారిన తొలి ట్రెండ్స్... ఆధిక్యంలోకి వచ్చిన ఎన్డీయే... అతిపెద్ద పార్టీగా బీజేపీ!
- నిమిషాల వ్యవధిలో పుంజుకున్న ఎన్డీయే
- ప్రస్తుతం 130 చోట్ల ఆధిక్యం
- 101 సీట్లకు పడిపోయిన మహా ఘటబంధన్
ఇక, బీహార్ లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనుంది. దాదాపు 70 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే దిశగా దూసుకెళుతున్నారు. ఆ తరువాత ఆర్జేడీ అభ్యర్థులు 50 స్థానాల వరకూ, జేడీయూ 35 స్థానాల వరకూ, కాంగ్రెస్ 20 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు గంటల్లో బీహార్ ఫలితాలపై పూర్తి స్పష్టత వెలువడుతుంది.