ఆర్జేడీ దూకుడు... 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం!
- ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం తలకిందులు
- భారీ మెజారిటీ దిశగా ఆర్జేడీ
- ఆధిక్యంలో సీఎం అభ్యర్థి తేజస్వి
మొత్తం 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్ లో 185 స్థానాల తొలి దశ కౌంటింగ్ పూర్తి కాగా, ఎన్డీయే 74 స్థానాల్లో, మహా ఘటబంధన్ 109 స్థానాల్లో ఆధిక్యంలో వున్నాయి. ఎల్జేపీ ఒక్క స్థానంలో, ఇతరులు మరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. సీఎం అభ్యర్థి తేజస్వితో పాటు ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్, పలువురు మహా ఘటబంధన్ నేతలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.