ఔటర్ రింగురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు ఢిల్లీ వాసుల దుర్మరణం

6 dead in road accident on outer ring road
  • బొలేరోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం
  • హైదరాబాద్ నుంచి పటాన్‌చెరు వెళ్తుండగా ఘటన
  • మృతుల వివరాల కోసం పోలీసుల ఆరా
ఔటర్ రింగురోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఢిల్లీకి చెందిన ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాటిగ్రామం వద్ద ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన కొందరు బొలేరో వాహనంలో హైదరాబాద్ నుంచి పటాన్‌చెరు వైపు ఔటర్ రింగురోడ్డు మీదుగా వెళ్తున్నారు.

పాటిగ్రామ శివారులో అదే రోడ్డుపై వెనక నుంచి  వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఒకటి బొలేరోను ఢీకొట్టింది. దీంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వాహనంలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఒకరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
ORR
Road Accident
Dehl

More Telugu News