ఔటర్ రింగురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు ఢిల్లీ వాసుల దుర్మరణం
- బొలేరోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం
- హైదరాబాద్ నుంచి పటాన్‌చెరు వెళ్తుండగా ఘటన
- మృతుల వివరాల కోసం పోలీసుల ఆరా
పాటిగ్రామ శివారులో అదే రోడ్డుపై వెనక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఒకటి బొలేరోను ఢీకొట్టింది. దీంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వాహనంలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఒకరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు.