Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో మరింతగా తగ్గిన కరోనా కేసులు.. అప్ డేట్స్ ఇవిగో!

AP registers 1392 new Corona Cases
  • గత 24 గంటల్లో కొత్తగా 1,392 కేసుల నమోదు
  • 11మంది మృతి
  • ప్రస్తుతం రాష్ట్రంలో 21,235 యాక్టివ్ కేసులు
ఏపీలో కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 1,392 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,44,359కి పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 11 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 6,802కి చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61,050 మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,235 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News