బ్లూ వేవ్ ఎక్కడిది? అంతా రెడ్‌ వేవే!: ట్రంప్

there is only red wave says donald trump
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ప్రస్థానం దాదాపు ముగిసినట్టు వార్తలు వస్తున్న వేళ నిన్న తొలిసారి ఆయన వైట్‌హౌస్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో బ్లూ వేవ్ (డెమొక్రాట్ల గాలి) ఎక్కడా కనిపించలేదని, ప్రతి చోట రెడ్ వేవే (రిపబ్లికన్ గాలి) ఉందన్నారు. మెయిల్ ఇన్ ఓటింగ్‌ను అవినీతి వ్యవస్థగా అభివర్ణించిన ట్రంప్, ఈ ఏడాది రిపబ్లిక్ మహిళల సంవత్సరంగా నిలిచిపోతుందన్నారు.

ఎన్నికలు మొదలైనప్పటి నుంచి మీడియాపై మండిపడుతున్న ట్రంప్ తాజాగా మరోమారు మీడియాను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో మీడియా, టెక్ కంపెనీలు జోక్యం చేసుకున్నాయని, అయినప్పటికీ చాలా రాష్ట్రాల్లో తన గెలుపును ఆపలేకపోయినట్టు పేర్కొన్నారు. లీగల్ ఓట్లను లెక్కిస్తే కనుక తన విజయం మరింత సులభం అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Donald Trump
America
white House
presidential polls

More Telugu News