Corona Virus: దేశంలో కొత్తగా 50,209 మందికి కరోనా నిర్ధారణ

50209 new COVID19 infections
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 50,209 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 83,64,086 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 55,331 మంది కోలుకున్నారు.

అలాగే గడచిన 24 గంట‌ల సమయంలో 704 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,24,315కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 77,11,809 మంది కోలుకున్నారు. 5,27,962 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 11,42,08,384 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 12,09,425 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News