ఫుడ్ డెలివరీ చేసినట్టు ఫొటో తీసుకుని, తిరిగి ప్యాకెట్ పట్టుకెళ్లిపోయిన యువతి... వీడియో ఇదిగో!

Delivaty Executive Theft food of A Customer video
  • నో కాంటాక్ట్ డెలివరీకి కస్టమర్ల ప్రాధాన్యం
  • డెలివరీ ఇచ్చినట్టు సాక్ష్యంగా ఫోటో తీసుకుని దొంగతనం
  • కోటి మందికి పైగా చూసిన వీడియో
కస్టమర్లకు ఇవ్వాల్సిన ఆహార ప్యాకెట్లను జాగ్రత్తగా కట్ చేసి, ఫుడ్ ను దొంగిలించిన వీడియోలను, కాస్తంత తినేసి, మిగతాది డెలివరీ చేసిన ఎగ్జిక్యూటివ్ లనూ చాలా మందినే చూసుంటాం. కానీ, ఈ వీడియో ఇంకాస్త వెరైటీగా ఉండి తెగ వైరల్ అవుతోంది. కరోనా మహమ్మారి కారణంగా, నో కాంటాక్ట్ డెలివరీకి కస్టమర్లు అధిక ప్రాధాన్యం ఇస్తుండంతో, డెలివరీ ఎగ్జిక్యూటివ్ లు ఆహారాన్ని తీసుకుని వచ్చి, డోర్ దగ్గర పెట్టి, బెల్ కొట్టి వెళ్లిపోతున్నారు.

అయితే, తాము డెలివరీ ఇచ్చామని చెప్పడానికి సాక్ష్యంగా, వారు ఓ ఫొటో తీసుకుని వెంటనే తాము పనిచేస్తున్న సంస్థ యాప్ లో అప్ లోడ్ చేయాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో ఓ టిక్ టాక్ యూజర్, తన ఇంటి ముందు అమర్చిన సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాన్ని తీసి, సోషల్ మీడియాలో పెట్టగా అదిప్పుడు వైరల్ అయింది.

తాను ఆర్డర్ చేసిన ఫుడ్ ను డెలివరీ చేసేందుకు వచ్చిన యువతి, ఆ ప్యాక్ ను ఇంటి డోర్ ముందు పెట్టి, పిక్ తీసుకుని, ఆపై ఆ ప్యాక్ ను తీసుకుని దర్జాగా వెళ్లిపోయింది. ఈ వీడియోకు ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తదితరాల్లో సైతం ఇది వైరల్ అయింది. ఇక ఇందులో డెలివరీ ఎగ్జిక్యూటివ్ యూఎస్ కు చెందిన 'డోర్ డాష్' ఉద్యోగిని అని తేలింది.

జరిగిన ఘటనపై స్పందించిన డోర్ డాష్ ఉన్నతాధికారి, ఈ తరహా ఘటనలను తాము సహించబోమని, కస్టమర్ కు క్షమాపణలు చెబుతున్నామని, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని తెలిపారు. వైరల్ అయిన వీడియోను మీరూ చూడవచ్చు.

Go Back to Shorts
Doordash
USA
Delivery

More Telugu News