Love Jihad: జిహాదీల పట్ల మౌనంగా ఉండబోము: కర్ణాటక మంత్రి

We will not allow Love Jihad says Karnataka minister Ravi
  • పెళ్లి కోసం మత మార్పిడిలను అనుమతించబోం
  • వీటిని నిషేధిస్తూ త్వరలోనే చట్టాన్ని తీసుకొస్తాం
  • మత మార్పిడిలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటాం
కేవలం పెళ్లి కోసమే మతాన్ని మార్చుకోవడాన్ని తాము అనుమతించబోమని... ఇలాంటి మత మార్పిడిలను నిషేధిస్తూ త్వరలోనే చట్టాన్ని తీసుకురాబోతున్నామని కర్ణాటక రాష్ట్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి తెలిపారు.

 రాష్ట్రంలోని యువతుల గౌరవ, మర్యాదలను జిహాదీలు దెబ్బతీయాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొస్తామని తెలిపారు. మత మార్పిడిలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవలే అలహాబాద్ కోర్టు కూడా పెళ్లి కోసం మతం మార్చుకోవడం చట్ట విరుద్ధమని చెప్పింది.
Love Jihad
Karnataka
CT Ravi
BJP

More Telugu News