180 డిగ్రీల కోణంలో కంగన లెగ్ స్ట్రెచ్.. ఫొటో వైరల్
- గతంలో షూటింగ్ సమయంలో తీసిన ఫొటో
- ‘తను వెడ్స్ మను రిటర్న్స్’లో తను పాత్రలో కంగన
- ‘దత్తు’ ఒక గొప్ప పాత్ర అవుతుందని ఎవరు ఊహించారని ప్రశ్న
ఢిల్లీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ ఫొటో దిగానని చెప్పింది. ఆ సినిమాలో లాంగ్ జంప్ సీన్‌కు ముందు తాను పూర్తిగా కాళ్లను స్ట్రెచ్ చేశానని చెప్పింది. ఆ ఫొటోలో దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కూడా ఉన్నారని తెలిపింది. కాగా, లాక్డౌన్ తర్వాత కంగన మళ్లీ సినిమా షూటింగుల్లో పాల్గొంటోంది. ఆమె చేతిలో తలైవితో పాటు పలు సినిమాలు ఉన్నాయి.