సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- పాత్ర కోసమే బరువు తగ్గానంటున్న కీర్తి
- రవితేజ 'ఖిలాడీ' షూటింగ్ మొదలైంది
- ప్రభాస్ సినిమాలో మరో బాలీవుడ్ నటి
* రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. మరోపక్క, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన 'క్రాక్' చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తారు.
* ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా, ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు వార్తలొస్తున్నాయి.