రాణించిన ఢిల్లీ బౌలర్లు... బెంగళూరు 152/7

Delhi bowlers restricts Banglore batsmen
ఐపీఎల్ లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో బెంగళూరు బ్యాట్స్ మెన్ స్వేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించలేకపోయారు. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (50) అర్ధసెంచరీ చేయగా, చివర్లో ఏబీ డివిలియర్స్ 21 బంతుల్లో 35 పరుగులు సాధించాడు. కెప్టెన్ కోహ్లీ 29 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో బౌండరీ లైన్ వద్ద స్టొయినిస్ కు చిక్కాడు. ఢిల్లీ బౌలర్లలో పేసర్ ఆన్రిచ్ నోర్జే 3, కగిసో రబాడా 2, అశ్విన్ ఓ వికెట్ తీశారు.
Go Back to Shorts
Delhi Capitals
Royal Challengers Bengaluru
IPL 2020
Abudhabi

More Telugu News