కమల హారిస్ నోట ఇడ్లీ సాంబార్ మాట!
- నవంబరు 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు
- సోషల్ మీడియా యూజర్లతో ముచ్చటించిన కమల
- తనకు నచ్చిన వంటకాలను వెల్లడించిన వైనం
తనకు వంట చేయడం అంటే చాలా ఇష్టమని, అప్పుడప్పుడు తన భర్త డగ్లస్ కు వంట నేర్పిస్తుంటానని తెలిపారు. ఉదయాన్నే లేచిన తర్వాత వ్యాయామం తప్పకుండా చేస్తానని, ఆపై పిల్లలతో ఉల్లాసంగా గడుపుతానని తెలిపారు.
అంతేకాదు, మహిళా సాధికారత పైనా ఆమె స్పందించారు. మహిళలు జీవితంలో ముందుకెళ్లాలంటే అందుకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. జీవితంలో ఎన్నో తిరస్కారాలు చవిచూశానని, వాటన్నింటినీ పట్టించుకోకపోతేనే అనుకున్నది సాధించగలమని తెలిపారు. అమెరికా అధ్యక్ష పదవికి నవంబరు 3న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.