హైదరాబాదు పోలీసుల అదుపులో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ బావమరిది!
- నవంబరు 3న దుబ్బాకలో ఉప ఎన్నికల పోలింగ్
- నేటితో ముగియనున్న ప్రచారపర్వం
- హైదరాబాదులో రూ.1 కోటి స్వాధీనం చేసుకున్న పోలీసులు
సురభి శ్రీనివాసరావు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు స్వయానా బావమరిది అని తెలిపారు. బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ మేనేజర్ నుంచి ఆ డబ్బును తీసుకుని దుబ్బాక వెళుతున్నట్టు వెల్లడైందని, విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కు చెందినదని అంజనీ కుమార్ వివరించారు. ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బు తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇటీవలే సిద్ధిపేటలో రఘునందన్ మామ, ఇతర బంధువుల నివాసాల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.