పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికే అప్పగించాలని నీతి ఆయోగ్ తెలిపింది: చంద్రబాబు
- ప్రాజెక్టును తాము 71 శాతం పూర్తిచేశామని వెల్లడి
- రూ.55 వేల కోట్ల అంచనాలకు కమిటీ ఆమోదం తెలిపిందన్న బాబు
- జగన్ అవగాహనలేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు
2019లో రూ.55 వేల కోట్ల అంచనాలకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. కానీ, సీఎం జగన్ పోలవరంపై అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. సమస్యపై కేంద్రంతో మాట్లాడకుండా, బాధ్యతారాహిత్యంతో లేఖ రాస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ సహకారంతో ప్రాజెక్టులు కడతామని మొదట్లో హడావుడి చేశారు అంటూ వ్యాఖ్యానించారు.