ముంబయి రోడ్డుపై ఫ్రాన్స్ అధ్యక్షుడి పోస్టర్లు అతికించిన దుండగులు... తొలగించిన పోలీసులు!
- భేండీ బజార్ రోడ్డుపై దర్శనమిచ్చిన మేక్రాన్ చిత్రాలు
- తొక్కుకుంటూ రాకపోకలు సాగించిన వాహనాలు, పాదచారులు
- ఎలాంటి కేసు నమోదు చేయలేదన్న పోలీసులు
కొన్ని వందల సంఖ్యలో పోస్టర్లు రోడ్డుపై అంటించి ఉండగా, వాటిని తొక్కుకుంటూ వాహనాలు, పాదచారులు రాకపోకలు సాగిస్తుండడం ఓ వీడియోలో దర్శనమిచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే భేండీ బజార్ రోడ్డు వద్దకు చేరుకుని మేక్రాన్ పోస్టర్లను తొలగించారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు వెల్లడించారు.