తన పెళ్లి వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చిన హీరో సాయితేజ్!
- త్వరగా వివాహం చేసుకోవాలనే ఉద్దేశం లేదు
- అమ్మాయిని వెతకాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు
- దీంతో పెళ్లికి ఓకే చెప్పాను
- ఈ నేపథ్యంలోనే వివాహంపై వదంతులు
త్వరగా వివాహం చేసుకోవాలనే ఉద్దేశం తనకు లేదని సాయితేజ్ స్పష్టం చేశాడు. తనకు తగిన అమ్మాయిని వెతకాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారని, దీంతో పెళ్లికి ఓకే చెప్పానని తెలిపాడు. తన వివాహం గురించి మీడియా అమితాసక్తి చూపుతోందని, ఈ నేపథ్యంలోనే తన వివాహంపై వదంతులు వస్తున్నాయని పేర్కొన్నాడు. కాగా, ఆయన నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. మరో సినిమాకు కూడా ఆయన కమిట్ అయ్యారు.