ఆ విషయంలో కేసీఆర్, హరీశ్‌రావుకు డాక్టరేట్లు ఇవ్వొచ్చు: డీకే అరుణ
- అబద్ధాలు చెప్పడంలో వారిద్దరూ దిట్ట
- దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారు
- ఓటమి భయంతోనే దాడులు
ఓటమి భయంతోనే అలజడి సృష్టిస్తున్నారని, తమకు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఇవ్వబోమని బెదిరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంపై ఆరోపణలు చేయడం తప్ప టీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. అబద్ధాలు చెప్పడంలో దిట్టలైన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు డాక్టరేట్లు ఇవ్వొచ్చని అరుణ ఎద్దేవా చేశారు.