వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. బావిలో పడ్డ జీపు.. ముగ్గురి గల్లంతు
- సంగెం మండలం గవిచర్ల వద్ద ప్రమాదం
- అదుపుతప్పి బావిలో పడ్డ జీపు
- ముగ్గురి కోసం గాలిస్తున్న పోలీసులు
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టి, మరో ముగ్గురి కోసం బావిలో గాలిస్తున్నారు. సంగెం మండలం గవిచర్ల వద్ద ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే జీపు అదుపుతప్పి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.