అమెరికా, యూరప్ దేశాల్లో మళ్లీ కరోనా... నష్టాల్లో ముగిసిన మన మార్కెట్లు!
- అంతర్జాతీయ స్థాయిలో సూచీలు పతనం
- భారత మార్కెట్లపైనా ప్రభావం
- నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
సెన్సెక్స్ 540 పాయింట్లు నష్టపోయి 40,145.50 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం అదే బాటలో నడిచింది. 152.30 పాయింట్ల నష్టంతో 11,778.05 వద్ద స్థిరపడింది. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హిండాల్కో, ఎం అండ్ ఎం, జేఎస్ డబ్ల్యూ స్టీల్ తీవ్రంగా నష్టపోయాయి. హెచ్ డీఎఫ్ సీ లైఫ్, నెస్లే, కోటక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టి లాభాల బాటలో నడిచాయి.