ములుగు జిల్లాలో నాలుగు నెలల బాలుడి కిడ్నాప్.. పట్టుకున్న స్థానికులు
- ములుగు జిల్లా వెంకటాపురంలో ఘటన
- కిడ్నాపర్లను వెంటాడి పట్టుకున్న స్థానికులు
- దత్తత ఇచ్చిన వారే కిడ్నాప్ చేశారంటూ మహిళ ఫిర్యాదు
స్నేహ-మహేందర్ దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఏడు నెలల గర్భిణిగా ఉన్న స్నేహ నాలుగు నెలల క్రితం నాగేశ్వరి అనే మహిళను ఆశ్రయించడంతో ఆమె కాన్పు చేసింది. అయితే, పుట్టిన బిడ్డను వద్దనడంతో నాగేశ్వరి ఆ బాలుడిని దత్తత తీసుకుంది. బాలుడి తల్లిదండ్రులే ఇప్పుడీ కిడ్నాప్‌నకు పాల్పడినట్టు నాగేశ్వరి ఆరోపిస్తోంది. అర్ధరాత్రి తనపై దాడిచేసి, కళ్లలో కారం చల్లి బాలుడిని ఎత్తుకెళ్లారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.