క్రిష్ సినిమాలో గెస్ట్ పాత్రలో రానా దగ్గుబాటి!
- గెస్ట్ పాత్రల వల్ల బిజినెస్ పరంగా క్రేజ్
- క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ సినిమా
- కథానాయికగా రకుల్.. ప్రత్యేక పాత్రలో రానా
- వికారాబాద్ అడవుల్లో ప్రస్తుతం షూటింగ్
ఇప్పుడు టాలీవుడ్ లో రూపొందుతున్న ఓ మెగా హీరో సినిమాలో కూడా ఇలాగే మరో హీరో రానా గెస్ట్ పాత్ర చేస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఓ పవర్ ఫుల్ గెస్ట్ పాత్ర ఉందట. ఈ పాత్ర కోసం రానాను అడిగారని, దర్శకుడు క్రిష్ తో వున్న అనుబంధం కారణంగా రానా వెంటనే ఒప్పుకున్నాడని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదు సమీపంలోని వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ గిరిజన యువతిగా నటిస్తోంది.