థాంక్యూ గాడ్... మరో బిడ్డ పుట్టిన ఆనందంలో హీరో కార్తి ట్వీట్
- కార్తి దంపతులకు మగబిడ్డ
- తమ జీవితాలను మార్చే అనుభూతి అంటూ కార్తి వ్యాఖ్యలు
- తన బిడ్డకు అందరి ఆశీస్సులు కావాలన్న కార్తి
తమిళ సీనియర్ నటుడు శివకుమార్ రెండో కుమారుడే కార్తి. కార్తి వివాహం 2011లో రజని చిన్నస్వామితో జరిగింది. కార్తి, రజని దంపతులకు ఇప్పటికే ఉమయాళ్ అనే కుమార్తె ఉంది. తాజాగా మరో బిడ్డ జన్మించడంతో కార్తికి సోషల్ మీడియాలో ప్రముఖుల నుంచి అభినందనలు అందుతున్నాయి.