Corona Virus: దేశంలో 75 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య

55722 fresh COVID19 cases in India total cases at 75 lakh
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసుల సంఖ్య  75 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 55,722 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 75,50,273 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 579 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,14,610 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 66,63,608 మంది కోలుకున్నారు. 7,72,055 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
       
      
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 9,50,83,976 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,59,786 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News