Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్ డేట్స్!

 1436 new corona cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,436 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,154 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,22,111 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,98,790 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,271 కి చేరింది. ప్రస్తుతం 22,050 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 18,279 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు.

జీహెచ్ఎంసీలో కొత్తగా 249 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 110 కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజులో తెలంగాణ వ్యాప్తంగా 41,043 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 38,30,503 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
 
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News