విజయవాడలో రూ. 35 లక్షల హవాలా సొమ్ము స్వాధీనం

  • రూ. 35 లక్షలు ఇచ్చి పిడుగురాళ్ల వ్యక్తికి అందించాలన్న భవానీపురం వాసి
  • రూ. 10 నోటుపై నంబరు కోడ్ ఆధారంగా చెల్లింపు
  • నగదు మార్చుకుంటుండగా దాడిచేసిన పోలీసులు
హవాలా రూపంలో రూ. 35 లక్షలు మార్చుతుండగా విజయవాడ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. హవాలా సూత్రధారి అయిన రాజస్థాన్‌కు చెందిన సత్యేంద్రసింగ్‌కు భవానీపురానికి చెందిన రావి వెంకటనారాయణ రూ. 35 లక్షలు ఇచ్చి ఆ సొమ్మును గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సత్యనారాయణకు ఇవ్వాలని కోరాడు.

ఇందులో భాగంగా రాజస్థాన్‌కు చెందిన పప్పుసింగ్ ఓ సీక్రెట్ కోడ్‌ను సత్యనారాయణకు పంపాడు. రూ. 10 నోటు బొమ్మపై ఉన్న నంబరు కోడ్‌ను ఆయన సత్యేంద్రసింగ్‌కు చూపిస్తే ఆయన ఆ మొత్తాన్ని ఇస్తాడు. పీఆర్‌కే బిల్డింగ్ వద్ద సత్యేంద్రసింగ్, సత్యనారాయణ నగదు మార్చుకుంటుండగా దాడి చేసిన పోలీసులు హవాలా సొమ్మును స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News