ఎన్నికల మహిమ!.... దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన జో బైడెన్
- అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందడి
- ట్రంప్, బైడెన్ హోరాహోరీ
- చెడుపై మంచి గెలవాలన్న బైడెన్
ఇక అసలు విషయానికొస్తే... జో బైడెన్ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. "హిందువులు జరుపుకునే నవరాత్రులు మొదలయ్యాయి. అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఈ పండుగ జరుపుకునే వారందరికీ నేను, జిల్ బైడెన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరోసారి చెడుపై మంచి గెలవాలని, మెరుగైన భవిష్యత్తు దిశగా శుభోదయం జరగాలని, అందరికీ అవకాశాలు లభించాలని కోరుకుంటున్నాం" అంటూ జో బైడెన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.