వరదలు వచ్చినా సాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో జగన్ ఉన్నారు: టీడీపీ నేత జవహర్
- జగన్ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రానికి అరిష్టం చుట్టుకుంది
- ఒక్క రోజైనా జనాలు ప్రశాంతంగా ఉన్నారా?
- వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలి
భారీ వరదలతో ప్రజలు అవస్థలు పడుతుంటే... జగన్ వల్లే వర్షాలు పడుతున్నాయని చెప్పడానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు సిగ్గుండాలని అన్నారు. వరదలు వచ్చినా సాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో జగన్ ఉన్నారని విమర్శించారు. వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.