డ్రగ్స్ కేసు.. నటుడు వివేక్ ఒబెరాయ్ భార్యకు నోటీసులు
- డ్రగ్స్ కేసులో వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య
- వివేక్ భార్య సోదరుడే ఆదిత్య
- ఆదిత్య కోసం వెతుకుతున్న పోలీసులు
కర్ణాటక మాజీ మంత్రి, దివంగత జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ భార్య ప్రియాంక అల్వా సోదరుడే ఆదిత్య. ఈ నేపథ్యంలో ఆదిత్య కోసం వివేక్ నివాసంలో బెంగళూరు సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. అతని ఆచూకీ లభించకపోవడంతో ప్రియాంకకు ఈరోజు నోటీసులిచ్చారు. తన సోదరుడికి సంబంధించిన వివరాలను ఆమె నుంచి సేకరించడానికి ఆమెను విచారించనున్నారు.