'థాంక్యూ మామా' అంటూ చిరంజీవికి సాయితేజ్ రిప్లై
- సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’
- ‘అమృత’ సాంగ్ విడుదల చేసిన చిరు
- సాయితేజ్ కి బర్త్ డే విషెస్ చెప్పిన చిరంజీవి
ఇదే తనకు వచ్చిన బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ అని ఆయన చెప్పాడు. ఈ రోజును ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు మామ అంటూ చిరంజీవిని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. లవ్యూ సో మచ్ అని, ఆయన నుంచి ఆశీర్వాదాలు తప్ప ఇంకేమీ అడగనని తెలిపాడు. కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికి మూడు పాటలు విడుదలయ్యాయి.
ఈ సినిమాలో పెళ్లి చేసుకోకుండా బతికితేనే జీవితం బాగుంటుందని చెప్పే పాత్రలో సాయితేజ్ నటించాడు. చివరకు ఆయన ఓ అమ్మాయి ప్రేమలో పడతాడని తెలుస్తోంది. ఆ ప్రేమ విఫలం కావడంతో లవ్ బ్రేకప్ సాంగ్ పాడతాడు. ’బల్బు కనిపెట్టినోడికే బతుకు చిమ్మ చీకటైపోయిందే, సెల్ ఫోన్ కంపెనోడికే సిమ్ కార్డు బ్లాకై పోయిందే’ అంటూ ఈ పాట ప్రారంభమవుతుంది. ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ ఈ పాట సాగుతుంది.