సింహాచలం దేవస్థానంలోని ఇత్తడి కానుకలు మాయం చేసింది ఇంటి దొంగలే: పోలీసులు
- 550 కిలోల ఇత్తడి కానుకలు మాయం
- నాలుగు రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
- 8 మంది అరెస్ట్
దర్యాప్తు చేపట్టిన పోలీసులు సింహాచలంలో నివసించే ఔట్ సోర్సింగ్ మాజీ ఉద్యోగి కె. సురేశ్, సోమ సతీశ్లను అనుమానించి విచారించగా విషయం బయటపడింది. ఆలయ వ్యర్థాల్లో కలిపి ఇత్తడి కానుకలను బయటకు తరలించినట్టు అంగీకరించారు. కానుకలను విక్రయించిన, కొనుగోలు చేసిన మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.